సెకండ్ షెడ్యూల్ ముగించుకున్న సూర్య 37 !

సెకండ్ షెడ్యూల్ ముగించుకున్న సూర్య 37 !

Published on Oct 14, 2018 8:25 PM IST

Surya1

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 37వ చిత్రం రెండవ షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో చిత్రానికి కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. సూర్య ఈచిత్రంలో కమాండో పాత్రలో నటిస్తున్నాడు.

రంగం ఫేమ్ కేవీ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో మోహన్ లాల్ , బోమన్ ఇరానీ , ఆర్య , చిరాగ్ జానీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈచిత్రంలో సూర్య సరసన సయేశా కథానాయికగా నటిస్తుంది.

ఇక సూర్య నటించిన 36వ చిత్రం ‘ఎన్ జి కె’ విడుదలకు సిద్దమవుతుంది. సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకులముందుకు రానుంది.

తాజా వార్తలు