యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) మ్యూజిక్ పనులు ప్రాంభమయ్యాయి. ప్రస్తుతం రాజమౌళి సంగీత దర్శకుడు కీరవాణి తో మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నాడు.
సినిమా చిత్రీకరణ స్టార్ట్ అయ్యేసరికి పాటలను కంప్లీట్ చేయాలని భాసిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఈచిత్ర షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ గా వున్నాడు. కానీ మరో హీరో రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన12 వచిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈనెలలో షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ నుండి రాజమౌళి చిత్రానికి అందుబాటులో వుండనున్నాడు.
ఇక దాంతో రాజమౌళి కూడా ఈచిత్రాన్ని డిసెంబర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని బావిస్తున్నాడట. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్నారు.


