సుప్రీమ్ హీరోతో హలొ బ్యూటీ !

సుప్రీమ్ హీరోతో హలొ బ్యూటీ !

Published on Oct 15, 2018 12:00 AM IST

Kalyani

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మూడు నెలల విరామం అనంతరం కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతన్నాడు. ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో ‘హలో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ , తేజు తో జతకట్టనుంది.

మైత్రి మూవీ మేకర్స్ ఈచిత్రాన్ని నిర్మించనుండగా ఈచిత్ర షూటింగ్ నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక వరుస పరాజయాలతో డీలా పడ్డ సాయి ధరమ్ ఈచిత్రం తోనైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు.

తాజా వార్తలు