ఇంటర్వ్యూ : బంగారి బాలరాజు డైరెక్టర్ కోటేంద్ర దుద్యాల – ‘బంగారి బాలరాజు’ అందరిని అలరిస్తుంది !

ఇంటర్వ్యూ : బంగారి బాలరాజు డైరెక్టర్ కోటేంద్ర దుద్యాల – ‘బంగారి బాలరాజు’ అందరిని అలరిస్తుంది !

Published on Oct 16, 2018 6:17 PM IST

Kotendra Dudyala

రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా కె. యం.డి. రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “బంగారి బాలరాజు”. ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా కోటేంద్ర దుద్యాల మీడియాతో మాట్లాడారు ఆయన ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..

సినిమా దేని గురించి ఉండనుంది ?

కర్నూల్ లో జరిగిన ఒక యదార్థ సంఘటన అధారంగా చేసుకొని ఈచిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. పరువు హత్యలు నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది. యూత్ కు నచ్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి.

హీరో హీరోయిన్ల గురించి ?

హీరో రాఘవ్ ఈ చిత్రంతోనే ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు. కొత్తవాడైన చాలా బాగా నటించాడు. ఇక హీరోయిన్ కత్రిన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సిరియల్స్ లో చేసింది. ఈచిత్రంలో తాను కూడా బాగా నటించింది.

మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి ?

చిన్నికృష్ణ – చిట్టిబాబు లు ఇద్దరు ఈచిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్స్ గా పనిచేశారు. చిత్రంలో 6పాటలు వున్నాయి. అన్ని ఆపాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రానికి నేపథ్య సంగీతం కూడా మేజర్ హైలైట్ కానుంది.

ఈచిత్రానికి ఆ టైటిల్ పెట్టడానికి గల కారణం ?
బంగారి బాలరాజు అనే టైటిల్ ఈచిత్రానికి సరిగ్గా సరిపోతుంది. బంగారి హీరోయిన్ పేరు బాలరాజు హీరో పేరు. వారిఇద్దరి మధ్య జరిగే లవ్ స్టోరీ నేపథ్యంలో ఈచిత్రం

మీ తదుపరి చిత్రం ?

డిసెంబర్ లో కానీ జనవరి లో కానీ ఉంటుంది. ప్రస్తుతం ఈచిత్రం విడుదలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విల్లెజ్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది.

తాజా వార్తలు