సెన్సార్ పూర్తి చేసుకున్న పందెంకోడి 2 !

సెన్సార్ పూర్తి చేసుకున్న పందెంకోడి 2 !

Published on Oct 17, 2018 1:49 AM IST

Pandem Kodi21

యాక్షన్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ‘పందెం కోడి 2’ గ్రాండ్ గా విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ రోజు ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. 149నిమిషాల నిడివితో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

కీర్తి సురేష్ కథనాయికగా నటించిన ఈ చిత్రంలో రాజ్ కిరణ్ , వరలక్ష్మి శరత్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. లింగు సామి తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ మూవీ ‘పందెంకోడి’ కి సీక్వెల్ గా వస్తుంది. ఇక ‘అభిమన్యుడు’ చిత్రంతో చాలా రోజుల తరువాత తెలుగులో సాలిడ్ హిట్ కొట్టిన విశాల్ ఈ చిత్రం కూడా విజయం సాదిస్తుందని ధీమాగా వున్నాడు. తెలుగు , తమిళ భాషల్లో ఈ చిత్రం అక్టోబర్ 18న భారీ స్థాయిలో విడుదలకానుంది.

తాజా వార్తలు