‘అమర్ అక్బర్ ఆంటోనీ’ నుండి లేటెస్ట్ అప్ డేట్ !

‘అమర్ అక్బర్ ఆంటోనీ’ నుండి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Oct 25, 2018 3:00 PM IST

AAAA

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపు పూర్తి అయ్యానని తెలుస్తోంది. పోస్ట్-ప్రొడక్షన్ పనులన్నీ శ్రీను వైట్లనే స్వయంగా దగ్గర ఉండి చూసుకున్నాడు. దీన్నిబట్టి… ఆయన ఈ సినిమా పట్ల ఎంత కేర్ తీసుకుంటున్నారో అర్ధం అవుతుంది.

ఇక గత కొంత కాలంగా తెలుగు తెరకు దూరమైన ప్రముఖ హీరోయిన్ ఇలియానా మళ్ళి ఈ చిత్రంతోనే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది . గత కొంతకాలంగా శ్రీను వైట్ల, రవితేజ ఇద్దరూ వరుస పరాజయాలతో సతమతవుతున్నారు. దాంతో ఈ చిత్రం విజయం ఈ ఇద్దరికీ చాలా కీలకం గా కానుంది. ఈ సారి మాత్రం ఇద్దరు భారీ సక్సెస్ కొట్టేలానే ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు