తమిళంలో ఘన విజయం సాధించి, ఈ2సీ బ్యానర్ (హౌస్‌ఫుల్ వినీత్, సందీప్) ద్వారా తెలుగులో విడుదలై ప్రేక్షకాదరణ పొందుతున్న “యూత్” సినిమా బ్లాక్‌బస్టర్ థ్యాంక్ మీట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ‘చార్మింగ్ స్టార్’ శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
కంటెంట్ బాగుంటే అన్ని భాషల సినిమాలను, కొత్త నటీనటులను ఆదరించే టాలీవుడ్ లాంటి గొప్ప ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలో ఎక్కడా ఉండరని శర్వానంద్ ప్రశంసించారు. కేవలం 23 ఏళ్ల వయసులో కెన్ కరుణాస్ దర్శకుడిగా, హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టడం అభినందనీయమన్నారు.
నిర్మాతలు సందీప్, వినీత్ మాట్లాడుతూ.. యువత తమ తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలనే మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెలుగులోకి తీసుకొచ్చామన్నారు. పేరెంట్స్‌తో కలిసి సినిమాకు వెళ్లే తొలి 500 మంది యువతకు ఉచిత టికెట్లు అందిస్తామని వారు ప్రకటించారు. తాను ఈ సినిమాలో ప్రభాస్ అభిమానిగా నటించానని, ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న సపోర్ట్ అనూహ్యమని హీరో కెన్ కరుణాస్ ఆనందం వ్యక్తం చేశారు. డైరెక్టర్ వశిష్ట, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని, హీరోయిన్లు మీనాక్షి, ప్రియాన్షి యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగు ప్రేక్షకుల ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు.


