రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి దర్శకత్వంలొ ప్రణతి ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘మంచు కురిసే వేళలో’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేసుకుంది. దేవా కట్టా వద్ద ‘ప్రస్థానం’ చిత్రానికి దర్శకత్వ శాఖలో చేసిన బాల తొలిసారి దర్శక నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత బాల మాట్లాడుతూ ‘మంచు కురిసె వేళలో ‘ టైటిల్ తగ్గట్టు గానే ప్యూర్ లవ్ ఎంటర్ టైనర్. వైజాగ్, కూర్గ్, ఊటి, అరకు ,హైదరాబాద్ లలొని అందమైన లొకెషన్స్ లొ చిత్రీకరణ జరిపాము. ‘మళ్లీ రావా’ ఫేం శ్రావణ్ భరద్వాజ్ సంగీతం, సినిమాటోగ్రఫీ మా సినిమాకు ఎసెట్ గా నిలుస్తాయన్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ ను విడుదల చేసి డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేస్తామన్నారు.


