రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తెరకెక్కించడానికి ముమ్మరంగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన వెన్నుపోటు సాంగ్ లో వర్మ నేరుగా చంద్రబాబు నాయుడిని కించపరుస్తూ లిరిక్స్ ఉన్నాయి, దాంతో తెలుగు తమ్ముళ్లకు ఒక్కసారిగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి ఆగ్రహానికి రామ్ గోపాల్ వర్మ కూడా ధీటుగానే సమాధానం ఇస్తున్నాడు.
వర్మ ట్వీట్ చేస్తూ.. ‘ నేను చంద్రబాబు నాయుడిగారిని డైరెక్ట్ గా ఒక్కమాట కూడా అనలేదు. అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్ట్ గా దూషించిన ఈ క్రింది వీడియోలోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి ? ‘ అని బాబు గురించి సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటల వీడియోను పోస్ట్ చేశారు.
నేను CBN గారిని డైరెక్ట్ గా ఒక్కమాట కూడా అనలేదు …అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్ట్ గా దూషించిన ఈ క్రింది వీడియో లోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి ?https://t.co/j70bgc1QhW
— Ram Gopal Varma (@RGVzoomin) December 23, 2018


