యువ హీరో అఖిల్ అక్కినేని నటించిన మూడవ చిత్రం మిస్టర్ మజ్ను మంచి అంచనాల మధ్య నిన్న విడుదలై మిక్సడ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. ఇక మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 4.3 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. అఖిల్ గత చిత్రాలతో ఓపెనింగ్స్ తో పోలిస్తే ఈచిత్రానికి తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఈ రోజు సెలవు దినం కావడం వల్ల కలెక్షన్స్ పెరిగే అవకాశం వుంది.
ఇక ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 3.24కోట్ల షేర్ ను రాబట్టింది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది.
తెలంగాణ &ఏపీ లో మొదటిరోజు కలెక్షన్ల వివరాలు :
| ఏరియా | కలక్షన్స్ |
| నైజాం | 1.08 కోట్లు |
| సీడెడ్ | 0.48లక్షలు |
| నెల్లూరు | 0.12లక్షలు |
| గుంటూరు | 0. 54లక్షలు |
| కృష్ణా | 0.25 లక్షలు |
| పశ్చిమ గోదావరి | 0.17లక్షలు |
| తూర్పు గోదావరి | 0.20లక్షలు |
| ఉత్తరాంధ్ర | 0.40లక్షలు |
| మొత్తం | 3. 24 కోట్లు |


