వివేక్ వర్మ దర్శకత్వంలో ఆదిత్య అల్లూరి, అనికా రావు జంటగా నటించిన చిత్రం స్వయంవద. లక్ష్మి చలన చిత్ర పతాకంపై రాజా దూర్వాసుల నిర్మించారు. జానపద కథల్లోని ఓ ఆసక్తికర నేపథ్యాన్ని ఎంచుకుని ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ప్రేక్షకులకు నచ్చే వాణిజ్య అంశాలన్నీ చేర్చి ఆసక్తికరంగా స్వయంవద చిత్రాన్ని మలిచారు. ఆత్మగౌరవం కోసం స్వయంవద అనే యువతి చేసే పోరాటమే ఈ సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుందన్నారు. పోసాని కృష్ణ మురళి, ధన్ రాజ్, ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 26న విడుదలకానుంది.