‘మహేశ్’ నెక్స్ట్ సినిమాకి టైటిల్ సెంటిమెంట్ !

‘మహేశ్’ నెక్స్ట్ సినిమాకి టైటిల్ సెంటిమెంట్ !

Published on May 15, 2019 4:00 AM IST

సూపర్ స్టేర్ మహేశ్ బాబు తన తరువాత సినిమాను అనిల్ రావిపూడితో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ ను పరిశీలిస్తోన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే సినిమాకి ఈ టైటిల్ ఫైనల్ కాదని తెలుస్తోంది. మూడు అక్షరాల పేరునే టైటిల్ గా పెట్టాలని చిత్రబృందం ఆలోచనలో ఉందట. మహేశ్ కి మూడు అక్షరాల టైటిల్ సెంటిమెంట్ ఉన్న విషయం తెలిసిందే. ‘మహర్షి’తో అది మళ్లీ ప్రూవ్ అయింది.

ఇక ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే విజయశాంతి మహేష్ బాబుకు అత్తగా నటించబోతున్నట్లు సమాచారం. ఆలాగే రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తోందట. కాగా ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఇటీవలే ‘ఎఫ్ 2’తో భారీ హిట్ ను కొట్టాడు అనిల్. ఇప్పుడు ఏకంగా మహేశ్ బాబును డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. మరి మహేశ్ తో కూడా హిట్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు