నా ‘బూతే’ నా భవిష్యత్తు అంటున్నారుగా

నా ‘బూతే’ నా భవిష్యత్తు అంటున్నారుగా

Published on May 16, 2019 10:05 AM IST

four moive

ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న సినిమాల ట్రెండ్ చూస్తే ఒకింత ఆశ్చర్యం, కలుగకమానదు. ఇప్పటివరకు ఉన్న సినిమా హద్దులు, సాంప్రదాయ సిద్ధాంతాలు వదిలేసినట్టున్నారు. శృతి మించిన శృంగారం, బూతు అర్థం వచ్చేలా డైలాగ్స్ ఉంటే చాలు సినిమాకు మినిమం వసూళ్లు వచేస్తాయనే ధోరణిలో ఇండస్ట్రీ వెళుతున్నట్టుగా ఉంది. సంప్రదాయవాదులు ఈ ట్రెండ్ ని ఖండిస్తున్నా, ఇష్టం లేకపోతే సినిమా కి రాకండి అంతేకాని మేము ఇలానే తీస్తాం అన్నట్లుగా తయారయ్యారు కొందరు దర్శకనిర్మాతలు.

అర్జునరెడ్డి మూవీలో ముద్దు సన్నివేశాలపై విపరీతమైన చర్చలు జరిగితే, ప్రస్తుతం తీసిన కొన్ని సినిమాలలో అంతకు మించి చూపించేస్తున్నారు. కొన్ని సినిమాల ట్రైలర్స్ ప్రారంభం లోనే ఓన్లీ పెద్దవారికి మాత్రమే అని హెచ్చరించి మరీ బాతులు చూపించేస్తున్నారు. ఇటీవల “డిగ్రీ కాలేజ్” అనే మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వెళ్లిన జీవిత రాజశేఖర్ ఆ ట్రైలర్ చూసి ఇటువంటి ,మూవీ అని తెలిస్తే అసలు వచ్చేదానినే కాదు అని స్టేజ్ పైనే చెప్పేశారు. “చీకటిగదిలో చితక్కొట్టుడు” “90ఎం ఎల్” “ఏడుచేపల కథ” లాంటి మూవీ లు ఈ కోవకు చెందినవే. కథలో శృంగారం అనే ట్రెండ్ పోయి కథే శృంగారం గా ప్రేక్షకులకు వండివార్చేస్తున్నారు. ఏది ఏమైనా సినిమాకి సుజన ముఖ్యం కానీ శృంగారం బూతులు కాదు

తాజా వార్తలు