మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వారసుడిగా మెగా కాంపౌండ్ నుండి తెరంగేట్రం చేసిన హీరోలలో అల్లు శిరీష్ ఒకరు. ఈ యంగ్ హీరో ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు 6ఏళ్లు అవుతుంది. ఐనా చెప్పుకోదగ్గ ఒక్క హిట్ ని తన ఖాతా లో వేసుకోలేకపోయాడు.
తన మరో ప్రయత్నంగా ఏబీసీడీ(అమెరికన్ బోర్న్ కంఫ్యూజ్డ్ దేశి)తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు శిరీష్ . సమ్మర్ కానుకగా ఈ మూవీ రేపటినుంచి థియేటర్లలో సందడి చేయనుంది. కామెడీ రొమాంటిక్ జోనర్ లో వస్తున్న ఈ మూవీకి సంజీవరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, మధురశ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. శిరీష్ కి జోడీగా రుక్షర్ ధిల్లాన్ చేస్తుంది. మరి ఏబీసీడీ తో నైనా శిరీష్ హిట్ మెట్టు ఎక్కుతాడేమో చూడాలి మరి.


