పూజాని ఏడిపించేసిన వరుణ్…,ఎవ్వరూ చూడని ఘటన.

పూజాని ఏడిపించేసిన వరుణ్…,ఎవ్వరూ చూడని ఘటన.

Published on Oct 1, 2019 3:58 PM IST

Pooja Varun

వరుణ్ తేజ్‌, అథర్వ మురళి ప్రధాన పాత్రలలో హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం గద్దలకొండ గణేష్‌. రెండు వారాల క్రితం విడుదలైన గద్దలకొండ గణేష్ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు మంచి వసూళ్లను రాబట్టింది. 14 రీల్స్ పతాకంపై హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. . పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అథర్వకి జంటగా మృణాలినీ రవి నటించింది. కాగా కొద్దిరోజులుగా చిత్ర బృందం గడ్డలకొండ గణేష్ చిత్రంలోని తొలగించిన సన్నివేశాలను యూట్యూబ్ లో విడుదల చేస్తూ మూవీకి మరింత ప్రచారం కల్పించే పనిలో పడ్డారు.

నిన్న పూజా, వరుణ్ ల మధ్య నడిచే సంఘర్షణాత్మక సన్నివేశాన్ని విడుదల చేశారు. పూజ ఊరి నుండి పారిపోయి పెళ్లి చేసుకుందాం అని బ్రతిమిలాడుతుంటే , వరుణ్ ఊరు వదిలి వెళ్ళేదే లేదంటూ ఖరాఖండీగా చెప్పే సన్నివేశం బాగుంది. ఈ ఒక్కసారి నామాట విను నాన్న, బుజ్జి అని పూజా వరుణ్ ని ప్రాధేయపడే సన్నివేశం హృద్యంగా ఉంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు