‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. మరోవైపు ఈ సినిమా సక్సెస్ మీట్ లో సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా అంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు. దీంతో, వీరిద్దరి కలయికలో సినిమా వస్తే ఎలా ఉంటుంది ?, అసలు సూర్యతో త్రివిక్రమ్ సినిమా చేస్తే.. ఆ కథ ఎలా ఉంటుంది ?, ఎలా ఉంటే బాగుంటుంది ?, నిజంగా ఈ సినిమా వస్తే ఎవరికి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది ? అంటూ నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు.
సూర్యను కేవలం మాస్ హీరోగా చూపించడం కంటే.. అతని నటనలోని ఎమోషనల్ యాంగిల్‌ను బయటకు తీసే కథను త్రివిక్రమ్ రాస్తే బాగుంటుంది అని, ఎలాగూ త్రివిక్రమ్ డైలాగ్స్ – సూర్య ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కలిస్తే.. ఈ కాంబినేషన్‌కు ఓ కొత్త ఫీల్ వస్తోందని.. కాబట్టి, కథలో ఫ్యామిలీ ఎమోషన్ పెట్టి, యాక్షన్‌తో సీన్స్ ను మిక్స్ చేస్తే బాగుంటుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ కాంబినేషన్‌పై తెలుగు – తమిళ ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి వస్తోంది. ఎలాగూ సూర్య సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు కూడా ఉంది.


