సైరా బాక్సాఫీస్‌ బద్దలు కొట్టడం ఖాయం !

సైరా బాక్సాఫీస్‌ బద్దలు కొట్టడం ఖాయం !

Published on Oct 1, 2019 6:19 PM IST

sye raa 11

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్నారు. గాంధీ జయంతి సందర్భంగా రేపు విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి రోజు దక్షిణాదిలో సైరా 30 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్ బ్రహ్మండంగా ఉన్నాయట. మొత్తానికి సైరా కచ్చితంగా బాక్సాఫీస్‌ ను బద్దలు కొడుతుందని.. కొత్త రికార్డ్స్ ను సృష్టించడం ఖాయం అట. మరి సైరా ఏ రేంజ్ రికార్డ్స్ ను సృష్టిస్తాడో చూడాలి. ఇప్పటికే ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకానున్న థియేటర్ల వద్ద అభిమానులు భారీ ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేస్తూ సందడి చేస్తున్నారు.

కాగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు