మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ప్రతిరోజు పండుగే. ఎంటర్టైనింగ్ దర్శకుడిగా పేరున్న మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా రాశి ఖన్నా మరో మారు ధరమ్ తేజ్ తో జోడి కడుతుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే నెలలో దీపావళి కానుకా ఈ మూవీ విడుదల అయ్యే అవకాశం కలదు.
కాగా కొద్దినెలలుగా గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్ నిన్నటితో పూర్తయింది. దీనితో దర్శకుడు మారుతీ,హీరో సాయి ధరమ్ హైదరాబాద్ పయనమయ్యారట. ఈ విషయాన్నీ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్న ధరమ్ తేజ్ రాజమండ్రి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నటుడు సత్యరాజ్ ఓ కీలకపాత్ర చేస్తున్న ప్రతిరోజు పండుగే చిత్రానికి సంగీతం ఎస్ ఎస్ థమన్ అందిస్తున్నారు. త్వరలో తదుపరి షెడ్యూల్ మొదలు కానుంది.
Thank you so much #Rajahmundry for all the love and affection…had a lovely & pleasant time shooting for #prathirojupandaage @DirectorMaruthi @GeethaArts @UV_Creations …now heading back to HYDERABAD for #Syeraaaaa ???????????????????????? pic.twitter.com/zkAZXyTR6V
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 1, 2019


