హిట్ టాక్ సొంతం చేసుకున్న సైరా నరసింహారెడ్డి చిత్రం, కలెక్షన్స్ పరంగా కూడా దుమ్మురేపుతుంది. ఈ మూవీ నైజాంలో మొదటి రోజు 7.9 కోట్ల షేర్ సాధించింది. ఇది నైజాంలో ఆల్ టైం టాప్ 3 హైయెస్ట్ షేర్ కావడం గమనార్హం. ప్రభాస్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో 9.4 కోట్ల ఫస్ట్ డే షేర్ కలెక్షన్స్ తో టాప్ లో కొనసాగుతుండగా, ఆతరువాత బాహుబలి2, 8.9కోట్ల షేర్ రాబట్టి రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇక మహేష్ లేటెస్ట్ సూపర్ హిట్ మహర్షి 6.38 కోట్ల షేర్ వసూళ్లతో నాలుగు స్థానంలో ఉండటం గమనార్హం.
ఇలా సైరా నరసింహారెడ్డి చిత్రంతో చిరు మహేష్ ప్రభాస్ మధ్యలో వచ్చి చేరారు. సాహో,బాహుబలి2, సైరా,మహర్షి,బాహుబలి చిత్రాలు టాప్ ఫైవ్ ఫస్ట్ డే హైయెస్ట్ నైజాం షేర్ సాధించిన చిత్రాలుగా కొనసాగుతున్నాయి. హిట్ టాక్ తెచ్చుకున్న సైరా కు రెండురోజులలో వీకెండ్ రావడంతో పాటు, దసరా సెలవుల నేపథ్యంలో లైఫ్ టైం వసూళ్ళలో సాహో, మహర్షి చిత్రాలను అధిగమించే అవకాశం కలదు.


