తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో జయలలితగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తుంది. ఈ చిత్రంలో ఎం.జి.ఆర్ (మరుతూర్ గోపాల రామచంద్రన్) పాత్రలో ప్రముఖ నటుడు అరవింద స్వామి నటిస్తున్నారు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి ప్రారంభం కానుంది.
ఈ సినిమా కోసం దాదాపు పది కిలోలు వరకూ కంగనా బరువు పెరగుతుందట. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. అలాగే ఈ బయోపిక్ లో మిగిలిన కీలకమైన పాత్రలు ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు. ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటించబోతుండగా.. అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానం కూడా సినిమాలో హైలెట్ చేస్తూ కథ ఉంటుందట. విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


