విడాకులు తీసుకోనున్న మంచు మనోజ్ దంపతులు

విడాకులు తీసుకోనున్న మంచు మనోజ్ దంపతులు

Published on Oct 17, 2019 5:13 PM IST

manoj

కొద్దిసేపటి క్రితం మంచు విష్ణు వ్యక్తిగత జీవితానికి సంబంధించి పెద్ద బాంబు పేల్చారు. ఆయన తన భార్య విడాకులు తీసుకోనున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీనిపై ఆయన ఓ పెద్ద నోట్ విడుదల చేయడం జరిగింది. “మేము మా వివాహ బంధానికి స్వస్తి చెప్పాలనుకుంటున్నాం. ఇది బాధకలిగించే అంశం ఐనప్పటికీ ఒకరి మనో భావాలను మరొకరు గౌరవించే వారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒకరి వ్యక్తిగత జీవితం పట్ల మరొకరికి మాకు గౌవరం వుంది. కొన్ని అనివార్య కారణాల వలన ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది” అని చెప్పుకొచ్చారు.

2015లో తన ప్రేయసి అయిన ప్రణీత రెడ్డిని మంచు మనోజ్ పెద్దల సమ్మతితో పెళ్లిచేసుకోవడం జరిగింది. మరి కారణాలేమైనా వీరు విడిపోతున్నట్లుగా మంచు మనోజ్ నేడు చెప్పడం జరిగింది. కెరీర్ పరంగా వెనుకబడిన మనోజ్ చిత్రాలలో పెద్దగా నటించడం లేదు. ఆయన నటించిన ఒక్కడు మిగిలాడు చిత్రం 2017లో విడుదలైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు