మారుతి రాక కోసం టాలీవుడ్ ఎదురుచూపులు..?

మారుతి రాక కోసం టాలీవుడ్ ఎదురుచూపులు..?

Published on Aug 14, 2026 11:00 PM IST

maruthi

2026 ముగియడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ, టాలీవుడ్ బాక్సాఫీస్ దృష్టి అప్పుడే 2027 సంక్రాంతి పండుగ వైపు మళ్లింది. ఈ పండుగ రేసును లక్ష్యంగా చేసుకుని పలు భారీ చిత్రాలు ఇప్పటికే తమ షూటింగ్‌లను శరవేగంగా ప్రారంభించాయి. చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో రానున్న మెగా 158, నాగార్జున ‘కింగ్ 100’, రవితేజ-విష్ణు-హసిత్ గోలి చిత్రం, వెంకటేష్-కల్యాణ్ రామ్-అనిల్ రావిపూడి కాంబినేషన్ ప్రాజెక్ట్, అలాగే శర్వానంద్-శ్రీను వైట్ల సినిమాలు ఇప్పటికే షెడ్యూళ్లను పూర్తి చేసుకుంటూ సెట్స్‌పై శరవేగంగా దూసుకుపోతున్నాయి.

అయితే, ఈ సంక్రాంతి రేసులో దర్శకుడు మారుతి మాత్రం కాస్త వెనుకబడినట్లు కనిపిస్తున్నారు. పండుగ నేపథ్యానికి సరిగ్గా సరిపోయే ‘హ్యాపీ పొంగల్’ అనే చిత్రాన్ని ఆయన ఇప్పటికే పట్టాలెక్కించాల్సి ఉన్నప్పటికీ, కారణాలేవో కానీ ఇంకా ఎలాంటి అధికారిక అప్‌డేట్ రాలేదు. పోటీలో ఉన్న మిగతా చిత్రాలు ముందస్తు ప్రణాళికలతో దూసుకెళ్తుండటంతో ‘హ్యాపీ పొంగల్’ టీమ్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ‘రాజా సాబ్’ ఫలితం నుంచి బయటపడి, మారుతి వెంటనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించి సరైన వేగాన్ని అందుకోవడం అత్యంత కీలకంగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు