లండన్ లో సందడి చేస్తున్న బాహుబలి టీమ్

లండన్ లో సందడి చేస్తున్న బాహుబలి టీమ్

Published on Oct 19, 2019 7:28 AM IST

Baahubali

బాహుబలి టీమ్ కొద్దిరోజుల క్రితం లండన్ వెళ్లడం జరిగింది. ప్రభాస్, రానా, రాజమౌళి, అనుష్క మరియు నిర్మాత శోభు యార్లగడ్డ ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ థియేటర్ నందు నేడు బాహుబలి ది బిగినింగ్ మూవీ ప్రదర్శించనున్నారు. భారత చలన చిత్ర పరిశ్రమ నుండి బాహుబలి సినిమాకు ఈ ఘనత దక్కడం విశేషం. ప్రతి ఏడాది ప్రపంచం వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన కొన్ని చిత్రాలను ఈ థియేటర్ నందు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ ఏడాది గాను, బాహుబలి చిత్రం తో పాటు, హ్యారీ పోటర్, బాండ్ మూవీ స్కై ఫాల్ చిత్రాలు ఎంపిక కబడ్డాయి. దీనితో చారిత్రాత్మక ఆల్బర్ట్ థియేటర్ నందు ఈ చిత్రాలు ప్రదర్శించనున్నారు.

వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ థియేటర్ దశబ్దాలుగా అనేక సాంస్కృతిక, కళల ప్రదర్శనకు వేదికగా ఉంది. దీనితో పాటు ఈ మూవీ లైవ్ ఆర్కెస్ట్రా ఉండటం మరో విశేషం. ఇప్పటికే అనేక ప్రపంచ వేదికలపై ప్రదర్శించబడిన బాహుబలి ఈ ఘనతను సాధించడం చెప్పుకోదగ్గ విషయం. ఐతే లండన్ వెళ్లిన బాహుబలి టీమ్ లో ఫస్ట్ పార్ట్ లో కీలక రోల్ చేసిన తమన్నా లేకపోవడం గమనార్హం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు