టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి ఎట్టకేలకు ఓ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఆమె క్లైమాక్స్ అనే చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. వివరాలలోకి వెళితే టాలీవుడ్లో క్లైమాక్స్ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. దర్శకుడు భవాని శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర చేయడం జరుగుతుంది. కాగా ఈ చిత్రంలో నటి శ్రీరెడ్డి వివాదాస్పద నటిగా నటిస్తుందని సమాచారం. కాగా ఆమూవీ షూటింగ్ కి సంబందించిన స్టిల్స్ సోషల్ మీడియాలో విడుదల అయ్యాయి. రాజేంద్ర ప్రసాద్ తెల్లని గడ్డం జుట్టుతో ఉండగా, 30ఇయర్స్ పృథ్వీ స్వామీజీ గెటప్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో డాన్స్ మాస్టర్ శివశంకర్ కూడా ఉండటం విశేషం.
ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని సమాచారం. దర్శకుడు భవాని శంకర్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తుండగా రాజేశ్వర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రాజేష్ ఈమూవీకి సంగీతం అందిస్తున్నారు.


