రెబెల్ స్టార్ కృష్ణం రాజు నిమోనియాతో బాధపడుతున్న కారణంగా చికిత్స కోసం బుధవారం రాత్రి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆయన్ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ విషయంపై మీడియాలో ప్రచారమైన కథనాలపై కృష్ణంరాజు గురువారం స్పందించారు.
కేవలం న్యూమోనియాకు చికిత్స చేయించుకోవడంతో పాటు రెగ్యులర్ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్ళానని, తన ఆరోగ్యంపై రకరకాలుగా కొన్ని మీడియాలు ప్రచారం చేశాయని అవేవీ నిజం కాదని చెప్పారు. ఇటువంటి వార్తలు వల్ల అభిమానులు కంగారు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం చాలా బాగుందని, కొన్ని పరీక్షలు పూర్తయిన వెంటనే ఇంటికి వెళ్లిపోతానని చెప్పారు. దీనితో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.


