మరో సాంగ్ తో రానున్న వెంకీమామ !

మరో సాంగ్ తో రానున్న వెంకీమామ !

Published on Nov 15, 2019 3:00 PM IST

Venky Mama4

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశ పనుల్లో ఉంది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుండి వెంకీ మామ టైటిల్ సాంగ్ విడుదల అయి మంచి హిట్ అయింది. తాజాగా రేపు సాయంత్రం సెకెండ్ సాంగ్ ‘ఎన్నాళ్ళకో’ అనే పాట కూడా విడుదల కానుంది.

ఇక ఫుల్ జోష్ మీదున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు