యాంగ్రీ హీరో కార్తీ హీరోగా జీతు జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దొంగ’. ఈ చిత్రంలో హీరో కార్తీ వదిన ‘జ్యోతిక’ ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. ఇక ఈ చిత్రం టీజర్ ను కింగ్ నాగార్జున విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీజర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. కార్తీ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందని టీజర్ ప్రారంభంలోనే చెప్పడం జరిగింది. రకరకాల పేర్లతో చలామణి అయ్యే దొంగగా పోలీసుల దృష్టిలో కనిపిస్తాడు కార్తీ. ఆడియన్స్ ని థ్రిల్ చేసే యాక్షన్ సీక్వెన్సులు ఉంటూనే అక్క, తమ్ముడు మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ కూడా కనిపిస్తాయి. ఈ టీజర్ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది.
దానికి తగ్గట్టుగానే గోవింద్ వసంత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇక ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ‘ఖైదీ’ తర్వాత యాంగ్రీ హీరో కార్తీ చేసిన ‘దొంగ’ ఫస్ట్ లుక్ తోనూ, టీజర్‌తోనూ ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


