నిర్మాతగా మారబోతున్న ‘హీరో’ !

నిర్మాతగా మారబోతున్న ‘హీరో’ !

Published on Dec 3, 2019 2:10 PM IST

Sairam Shankar

దర్శకుడు పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ ఇప్పటికే హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు, అయితే త్వరలో నిర్మాతగా కూడా మారబోతున్నాడు. తన స్నేహితులతో కలిసి ఇక నుండి వరుసగా సినిమాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా సాయి రామ్ శంకర్ వేరే హీరోలతో కూడా సినిమాలను నిర్మించాలనుకుంటున్నారట. దీనికి సంబంధించి జనవరిలో అధికారిక ప్రకటన రానుంది.

ఇక సాయి రామ్ శంకర్ ప్రస్తుతం కృష్ణ చిరుమామిళ్ల దర్శకతంలో జె సురేష్ రెడ్డి, రాజు, ఎన్ వి ఎన్ రాజా రెడ్డి సంయుక్తం గా నిర్మిస్తున్న ‘రి సౌండ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమా మంచి కథ, కొత్త గా ఉంటుందట.

తాజా వార్తలు