కొత్త వ్యాపారం మొదలెడుతున్న యంగ్ హీరో.

కొత్త వ్యాపారం మొదలెడుతున్న యంగ్ హీరో.

Published on Dec 8, 2019 6:44 PM IST

హీరో సందీప్ కిషన్ ఓ ప్రక్క వరుసగా సినిమాలు చేస్తూనే మరో ప్రక్క వ్యాపారాలు మొదలుపెడుతున్నారు. ఇప్పటికే ఆయన ‘వివాహ భోజనంభూ’ పేరుతో ఓ రెస్టారెంట్ నడుపుతున్నారు. తాజాగా ఆయన బ్యూటీ సెలూన్ స్థాపించనున్నారు. విజయవాడ వేదికగా క్యూ బి ఎస్ అనే ఓ బ్యూటీ సెలూన్ రేపు ప్రారంభించనున్నారు. ఈ క్యూ బి ఎస్ యూనిసెక్స్ సెలూన్ నందు ఆడ మరియు మగవారికి సంబందించిన హెయిర్, బ్యూటీ కి సంబందించిన సేవలు దొరుకుతాయి. రేపు ఉదయం 10:30 నిముషాలకు గ్రాండ్ గా ప్రారంభం కానుండగా ఈ కార్యక్రమానికి ఫ్యాన్స్ రావలసిందిగా సందీప్ ఆహ్వానించారు.

ఈ మధ్య చాలా మంది హీరోలు సినిమాలలో సంపాదనను ఇలా వ్యాపారాలకు తరలిస్తున్నారు. మహేష్, విజయ్ దేవరకొండ లాంటి వారు ప్రత్యేకమైన గార్మెంట్ బ్రాండ్స్ మొదలుపెట్టడం జరిగింది. ఇక ఇటీవల తెనాలి రామ కృష్ణ బిఏ బిఎల్ అంటూ పలకరించిన సందీప్ ప్రస్తుతం ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ పేరుతో ఓ మూవీ చేస్తున్నారు. హాకీ నేపథ్యంలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు