తమన్నాతో మహేష్ గ్రేస్ స్టెప్స్ ఓ రేంజ్ ఉన్నాయిగా

తమన్నాతో మహేష్ గ్రేస్ స్టెప్స్ ఓ రేంజ్ ఉన్నాయిగా

Published on Dec 29, 2019 9:28 AM IST

daang

మహేష్ ఫ్యాన్స్ కి సరిలేరు నీకెవ్వరు యూనిట్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రంలోని డాంగ్ డాంగ్ అనే సాంగ్ ప్రోమో వీడియో విడుదల చేసి షాక్ ఇచ్చారు. తమన్నా మరియు మహేష్ మధ్య వచ్చే ఈ స్పెషల్ ఐటెం నంబర్ లో మహేష్ గ్రేస్ స్టెప్స్ తో ఇరగదీశారు. తమన్నా పార్టీ ఇస్తా అంటూ వేసిన హాట్ స్టెప్స్ కిక్కెస్తున్నాయి. ప్రోమో అదిరిపోవడంతో ఫుల్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రం నుండి ప్రతి సోమవారం ఒక సాంగ్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈనెలలో చివరి సోమవారం అనగా రేపు డాంగ్ డాంగ్ సాంగ్ విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ ప్రోమో యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దక్కించుకోవడంతో పాటు టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందిస్తునారు.

సాంగ్ ప్రోమో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు