ఆరు నెలల్లో థియేటర్ ఇండస్ట్రీకు వాటిల్లిన భారీ స్థాయి నష్టం.!

ఆరు నెలల్లో థియేటర్ ఇండస్ట్రీకు వాటిల్లిన భారీ స్థాయి నష్టం.!

Published on Sep 15, 2020 1:49 PM IST

ఈ ఏడాది అనుకోకుండా మారిపోయిన పరిస్థితుల మూలాన ఎన్నో పరిశ్రమలు ఆర్ధికంగా పడిపోయి ఇప్పుడు పుంజుకుంటున్నాయి..ఒక్క సినిమా పరిశ్రమ తప్ప. సినిమాలు అయినా నేరుగా ఓటిటిలో విడుదల అవుతున్నాయి కానీ మెయిన్ లక్ష్యం ఎప్పుడు వెండితెర మాత్రమే ఉంటుంది.

కానీ ఇప్పుడు ఆ వెండితెర ను నమ్ముకున్న వారి పరిస్థితే అద్వానంగా మారిపోయింది. దీనితో ఎందరో ఉద్యోగాలను కోల్పోయారు, మరికొంత మంది ప్రాణాలను కూడా తీసుకుంటున్నారు. దీనితో దేశీయ మల్టీ ప్లెక్స్ వారు అంతా ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఎలాగో దేశ ప్రభుత్వం వారు అన్లాక్ పేరిట అన్ని రంగాలను పలు నిబంధనలతో తెరుస్తున్నారు అలా థియేటర్స్ ను కూడా తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నారు.

సరైన జాగ్రత్తలు తీసుకొంటు థియేటర్స్ ను రన్ చేస్తామని అంటున్నారు. అలాగే వీరు చెబుతున్న దాని ప్రకారం కేవలం ఈ 6 నెలల వ్యవధిలో ఒక్కో నెలకు మొత్తం దేశ వ్యాప్తంగా 1500 కోట్లు నష్టం చొప్పున మొత్తం 9000 వేల కోట్లు నష్టం వచ్చింది అని లక్షలాది మంది ఆధార పడి జీవిస్తున్న ఈ థియేటర్స్ ను తిరిగి తెరుచుకునేలా చెయ్యాలని మల్టీ ప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు కోరుతున్నారు. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు