రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించనున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’ మొదలుకాక ముందే వివాదాల్లోకి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం హిందుత్వ అభిమానులు, రామభక్తులు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రావణ పాత్రధారి సైఫ్ ముంబై మిర్రర్ పత్రికతో మాట్లాడుతూ వివాదానికి కారణమయ్యాడు. కాగా తాజాగా “నేను ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా క్షమాపణ చెబుతున్నాను. రావణుడి పై నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాయి. రాముడు ఎల్లప్పుడూ నాకు ధర్మానికి మరియు వీరత్వానికి చిహ్నంగా ఉన్నారు’ అంటూ సైఫ్ ఈ వివాదానికి ముగింపు పలికాడు.
ఇంతకీ సైఫ్ ఏమన్నాడు అంటే.. ఈ సినిమాలో రావణుడిలోని మానవీయ కోణాన్ని చూపించున్నట్టు.. అనగా, ఓ రాక్షసుడిగా కాకుండా మనిషిగా చిత్రీకరించడమే కాదు, సీతమ్మను ఎత్తుకుపోవడాన్ని కూడా అతని కోణంలో కరెక్ట్ అనేవిధంగా ఉంటుందని సైఫ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో
సీతగా కృతి సనోన్ నటిస్తోంది. ఇక తన మార్కెట్ కి తగ్గట్లుగానే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను సెట్ చేసుకుంటూ ప్రభాస్ ముందుకు పోతున్నాడు. అలాగే ఈ భారీ ప్రాజెక్ట్ ను నార్మల్ గానే కాకుండా ప్రభాస్ ఇది వరకు టచ్ చెయ్యని 3డి టెక్నాలజీలో తెరకెక్కించనున్నారు. మరి ఈ భారీ చిత్రం ఎలా ఉండనుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.


