సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ చిత్రమే “వారణాసి”. గ్లోబల్ లెవెల్లో దీనిపై మంచి హైప్ నెలకొనగా ఈ సినిమాలో ఇండో హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈమె నటించిన తాజా హాలీవుడ్ చిత్రం ఒకటి నేరుగా ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
మరి ఆ చిత్రమే “ది బ్లఫ్”. ఇదే అమెజాన్ ప్రైమ్ వీడియో పాపులర్ వెబ్ సిరీస్ ది బాయ్స్ నటుడు కార్ల్ అర్బన్ మేల్ లీడ్ లో దర్శకుడు ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ చిత్రం ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది.
భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రైమ్ వీడియోలో ఈ మధ్యాహ్నం నుంచి ఒరిజినల్ ఇంగ్లీష్ తో పాటుగా మన తెలుగు డబ్బింగ్ సహా మొత్తం 19 భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. సో వారణాసి బ్యూటీ నటించిన ఈ కొత్త సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే ప్రైమ్ వీడియోలో చూడాలి.


