మాస్ మహారాజ రవితేజ చాలా రోజుల క్రితమే రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాను చేయడానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రజెంట్ ఆయన చేస్తున్న ‘క్రాక్’ షూటింగ్ చివరి దశలో ఉండటంతో ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాయడం స్టార్ట్ చేశారు. రవితేజ సినిమాకి ఆయన డైలాగ్స్ రాయడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమా కూడ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.
ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తారని టాక్. అందుకే ఆయనకు జోడీగా రాశీఖన్నా, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించనున్నారని సమాచారం. అలాగే ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసి అలరించిన డింపుల్ హయాతీ ఇందులో కూడ ఒక స్పెషల్ సాంగ్ చేయనుందట. కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్ వర్మ రవితేజతో గతంలో ‘వీర’ సినిమా చేయడం జరిగింది. ఆయన ‘రాక్షసుడు’ చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు. అందుకే ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి.


