
నేషనల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ బడా దర్శకుడు సంజయ్ రౌత్ తో “ఏ- ఆది పురుష్” అనే మరో భారీ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతుంది. కాగా రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. సీతగా కృతి సనోన్ నటిస్తోంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం లక్ష్మణుడిగా తమిళ్ హీరో అథర్వా ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
ఇక అథర్వ వరుణ్ గజ్జలగొండ గణేష్ లో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇక కృతి సనోన్ గతంలో సూపర్ స్టార్ మహేష్ సరసన వన్: నేనొక్కడినే, నాగచైతన్య సరసన దోచేయ్ సినిమాల్లో నటించింది. ఇక తన మార్కెట్ కి తగ్గట్లుగానే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను సెట్ చేసుకుంటూ ప్రభాస్ ముందుకు పోతున్నాడు. కాగా బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ఏ బాలీవుడ్ స్టార్ తోనో ఇలాంటి భారీ సినిమాను చేయకుండా, సౌత్ హీరో అయిన ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే. అన్నట్టు ఈ సినిమాని 3డి విజువల్ గ్రాఫిక్స్ తో ఒక మహదాద్భుతంగా తెరకెక్కించి దేశంలోని అన్ని భాషలతో పాటు విదేశాల్లోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.

