ప్రభాస్ ‘సలార్’ మూవీలో నటించే అవకాశం త్వరపడండి మరి !

ప్రభాస్ ‘సలార్’ మూవీలో నటించే అవకాశం త్వరపడండి మరి !

Published on Dec 9, 2020 8:50 PM IST

Salar

ఇప్పుడు రెబల్ స్టార్ సినిమా అంటే వేరే లెవల్. ఆయన సినిమా అంటూ చేసే అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిపోతోంది. బడ్జెట్ కూడ వందల కోట్లలో ఉంటోంది. మరి అలాంటి సినిమాల్లో నటించే అవకాశం రావడం గొప్ప విషయమే కదా. ఇలాంటి అవకాశం కోసం ఎంతో మంది ట్రై చేస్తుంటారు. మంచి క్యారెక్టర్ దొరికితే కెరీర్ ఊపందుకుంటుందనే ఆశతో ఉంటారు. ప్రభాస్ కొత్తగా ప్రశాంత్ నీల్ సినిమాకు సైన్ చేశారు. ‘రాధే శ్యామ్’ పూర్తికాగానే ఈ సినిమా షూట్ మొదలవుతుంది. ఈ భారీ యాక్షన్ చిత్రంలో నటించడం కోసం అన్ని భాషలు నుండి నటీనటుల్ని తీనుకుంటున్నారు. అది కూడ ఆడిషన్స్ నిర్వహించి మరీ తీసుకుంటున్నారు.

ముందుగా హైదరాబాద్లో ఆడిషన్స్ చేయనున్నారు. ఈ నెల 15వ తేదీన శేరిలింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆడిషన్స్ జరగనున్నాయి. అన్ని వయసుల వారు ఒక నిముషం వీడియో ఫుటేజ్ తీసుకుని ఆడిషన్ ఇవ్వొచ్చు. నచ్చితే ‘సలార్’ బృందం నుండి ఇన్విటేషన్ అందుకోవచ్చు కూడ. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి. ఇకపోతే ఈ సినిమా కోసం ప్రభాస్ లుక్ కూడ మార్చుకుంటున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బోలెడంత క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదల సమయానికి భారీ హైప్డ్ మూవీగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. కెజిఎఫ్’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలే ఈ సినిమాను కూడ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు