నాని “శ్యామ్ సింగ రాయ్” లాంచ్ అయ్యిపోయింది.!

నాని “శ్యామ్ సింగ రాయ్” లాంచ్ అయ్యిపోయింది.!

Published on Dec 10, 2020 2:15 PM IST

Shyam Singha Roy

తనదైన నటన మరియు సినిమాల ఎంపికలతో తెలుగు సినీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో “నాచురల్ స్టార్ నాని”. తన నటనకు తోడు వైవిధ్య స్క్రిప్టులను ఎంచుకొంటున్న నాని ఇప్పుడు కూడా పలు విభిన్న కథా చిత్రాలను చేస్తున్నాడు. అలా లేటెస్ట్ గా టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న “శ్యామ్ సింగ రాయ్” అనే చిత్రాన్ని స్టార్ట్ చేసేసారు. ఈరోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమంతో ఈ చిత్రం మొదలయ్యింది.

ప్రముఖ సినీ నటులు మరియు దర్శకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ సాయి పల్లవి మరియు కృతి శెట్టిలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో స్క్రిప్టును హిట్ దర్శకులు శివ నిర్వాణ, వెంకీ కుడుముల అందించగా మొదటి షాట్ కు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల నుంచే రెగ్యులర్ గా మొదలు కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు