‘ఎఫ్ 3’తో పాటు వెంకీ నుండి మరో సినిమా కూడా !

‘ఎఫ్ 3’తో పాటు వెంకీ నుండి మరో సినిమా కూడా !

Published on Dec 14, 2020 10:00 PM IST

F3

యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో విక్టరీ వెంకటేష్ ఆ మధ్య ఓ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా.. మధ్యలో లాక్ డౌన్ రావడంతో వెంకీ సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఇటివలే నారప్ప షూటింగ్ ను స్టార్ట్ చేశాడు. అయితే జనవరి నెలాఖరు నుండి ఎఫ్ 3, అలాగే మార్చి నుండి మరో సినిమాని మొదలుపెట్టడానికి వెంకీ రెడీ కానున్నాడు. ఆ సినిమాకి తరుణ్ భాస్కర్ డైరెక్టర్. ఇప్పటికే తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్‌ ను కూడా పూర్తి చేశాడు. తాజాగా ఫుల్ స్క్రిప్ట్ విన్న వెంకీ మరియు సురేష్ బాబు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

కాగా తరుణ్ భాస్కర్ తో విక్టరీ వెంకటేష్ సినిమా కాలేజీ నెపథ్యంలో సాగుతుందని, వెంకీ లెక్చరర్ గా నటించబోతున్నాడని.. చాలా వరకు సినిమాలో మంచి ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ‘వెంకీ’ నుండి కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమా కోసం వెంకీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వెంకీ హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు