ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ లో ఇంకా కొద్ది మంది మాత్రమే మిగిలి ఉన్నారు. మరి ఈ కొద్ది మందిలో ఎవరు టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అన్నది కూడా మంచి ఆసక్తికరంగా మారింది. అయితే ఈ టైటిల్ విన్నింగ్ రేస్ లో గట్టి పోటీ ఇస్తున్న కంటెస్టెంట్స్ లో అభిజీత్ కూడా ఒకడు.
అయితే బిగ్ బాస్ హౌస్ లోని అభి కు మరియు మోనాల్ కు ఎప్పటి నుంచో చిన్న కోల్డ్ వార్ ఉన్న సంగతి తెలిసిందే. అది పలుమార్లు అభిజీత్ కూడా రివీల్ చేసాడు. అయితే ఇపుడు బిగ్ బాస్ హౌస్ నుంచ్చి బయటకు వచ్చాక అభిజీత్ పై మోనాల్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
అఖిల్ కు అభికు అంతగా తేడా కనిపించలేదని కానీ అభిజీత్ మాత్రం అంత హైపర్ కాడు అలాగే ఏదైనా సరే చాలా స్ట్రెయిట్ గా చాలా క్లారిటీగా చెప్తాడని తెలిపింది. అలాగే చాలా గౌరవంగా ఉంటాడని అన్నది. మరి తనకి నచ్చనిది ఏదన్నా అంటే కొన్ని సార్లు అతనే రైట్ అనుకుంటాడని అలాగే అతనికి ఈగో చాలా ఎక్కువ అని అది కాయాన్ని కాస్త తగ్గిస్తే అతని లవ్ చెయ్యని వారు అంటూ ఎవరూ ఉండరని లేటెస్ట్ ఇంటర్వ్యూ లో తెలిపింది.


