ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ వింటేజ్ చిత్రం “రాధే శ్యామ్”. మంచి అంచనాలను నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ షూట్ లో బిజీగా ఉంది. ఇందులో ఇద్దరుహీరో హీరోయిన్స్ పాల్గొంటుండగా ఈ క్లైమాక్స్ చిత్రీకరణపై మాత్రం మంచి బజ్ వినిపిస్తుంది.
ఈ సినిమా కోసం ఒక సరికొత్త టెక్నాలజీ తో వచ్చిన టీం ఇప్పుడు క్లైమాక్స్ మొత్తం నాలుగు రియలిస్టిక్ సెట్స్ లో చేస్తున్నారట. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒకప్పటి సెట్టింగులతో ఈ చిత్రం చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తుంది.మరి ఈ మధ్య కాలంలో ఈ సినిమా క్లైమాక్స్ కోసమే ఆసక్తికర వార్తలు అన్ని వినిపిస్తున్నాయి మరి విజువల్ గా అది ఎలా ఉంటుందో చూడాలి.


