నాని చేస్తున్న కొత్త సినిమాల్లో ‘టక్ జగదీష్’ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని ‘నిన్నుకోరి, మజిలీ’ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నారు. లాక్ డౌన్ అనంతరం రీస్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు టైటిల్ పోస్టర్ మాత్రమే విడుదలచేసిన టీమ్ ఇప్పుడు కొత్త అప్డేట్ రెడీ చేశారు. దీన్ని రేపు ఉదయం 10 గంటల 53 నిముషాలకు రిలీజ్ చేయనున్నారు.
అయితే ఈ అప్డేట్ సినిమా టీజర్ గురించి అయ్యుంటుందా లేకపోతే హీరో పాత్ర పరిచయం మీదనా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాను శివ నిర్వాణతో ‘మజిలీ’ చిత్రాన్ని నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలు నిర్మిస్తున్నారు. ఇందులో రీతు వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో అన్నదమ్ముల సెంటిమెంట్ ప్రధానంగా ఉండబోతుందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ లెక్కలను అనుకుంటున్నారు నాని.


