టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన మరో మాస్ ఎంటెర్టైనర్ “రెడ్”. దర్శకుడు పూరి జగన్నాథ్ తో తెరకెక్కించిన లాస్ట్ చిత్రం “ఇస్మార్ట్ శంకర్”తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రామ్ ఆ తర్వాత చేసిన రెడ్ పై కూడా అంతే స్థాయి అంచనాలు తెచ్చుకోగలిగాడు. తన హిట్ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ రీమేక్ చిత్రంపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విడుదలకు కూడా కరోనా బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే.
కానీ మధ్యలో పలు ఓటిటి ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా మేకర్స్ థియేట్రికల్ రిలీజ్ కే స్టిక్ అయ్యి ఉన్నారు. మరి ఆ మధ్య సంక్రాంతి రేస్ లో ఈ చిత్రాన్ని నిలపాలని ఫిక్స్ చేసారు కానీ మళ్ళీ అది కాస్తా మారినట్టు కూడా తెలిసింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏమిటంటే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో మాల్వికా శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందించారు.


