
ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న “సర్కారు వారి పాట” అనే మాస్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రతీ అంశంలోనూ మంచి అంచనాలు పెట్టుకున్న మహేష్ ఫ్యాన్స్ ఓ విషయాన్ని మరింత స్పెషల్ గా తీసుకున్నారు, అదే సంగీతం విషయంలో.
ఇప్పటి వరకు థమన్ తో మహేష్ చేసిన ప్రతీ సినిమాకు అదిరిపోయే పాటలు ముఖ్యంగా ఇంట్రో సాంగ్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను అందించారు. దీనితో ఈ సినిమాపై అంతకు మించిన అంచనాలే పెట్టుకున్నారు. మరి అందుకు ఏమాత్రం తగ్గకుండా థమన్ కూడా అదిరిపోయే ట్యూన్స్ కొన్ని ఆల్రెడీ రెడీ చేసేసినట్టుగా టాక్ వినిపిస్తుంది.
ఇంకా మోషన్ పోస్టర్ టీజర్ లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. మరి దానిని మించిన ట్రీట్ నే సినిమాలో థమన్ ప్లే చేస్తున్నాడట. మరి మొత్తానికి మాత్రం థమన్ నుంచి ఈసారి కూడా సాలిడ్ ట్రీట్ ఉంటుందని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

