
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం లైన్ లో ఉండగానే చాలానే సినిమాలను లైన్ లో పెట్టేసారు. అలాగే వాటిలో ప్రతీ దానిపై కూడా సెపరేట్ సెపరేట్ గా అంచనాలు నెలకొన్నాయి. అయితే పవన్ అలా చేపట్టిన పలు ఆసక్తికర సినిమాల్లో “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి.
ఇది అయితే అనౌన్సమెంట్ తోనే భారీ హైప్ ను తెచ్చుకుంది. మరి ఈ సినిమాపై అప్పటి నుంచి కూడా పలు ఆసక్తికర వార్తలే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పవన్ రోల్ కు గాను సాయి పల్లవి ఉంటుంది అని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో టాలీవుడ్ హల్క్ రానా చేస్తాడని తెలిసిందే.
మరి ఈ పాత్రకు రానానే కన్ఫర్మ్ అన్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి అలాగే ఈ రోల్ కు ఫిమేల్ లీడ్ గా టాలెంటడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను అనుకుంటున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో మరిన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

