బిగ్ బాస్ 4 : విన్నర్ అభిజీత్ లో మెగాస్టార్ కు కూడా ఈ అంశమే నచ్చిందిగా.!

బిగ్ బాస్ 4 : విన్నర్ అభిజీత్ లో మెగాస్టార్ కు కూడా ఈ అంశమే నచ్చిందిగా.!

Published on Dec 21, 2020 10:00 AM IST

BiggBossT

మన తెలుగు స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీసన్ 4 మొత్తానికి నిన్న గ్రాండ్ ఫినాలేలో ఎన్నో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ తో సిసలైన బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ తో అంతే గ్రాండ్ గా ముగిసింది. గత సీసన్ ను గ్రేస్ చేసిన మెగాస్టార్ ఈసారి కూడా తనదైన రీతిలో ఎంటర్టైన్ చేశారు.

అయితే ఈసారి టైటిల్ విన్నర్ ఎవరో ముందే కితాబిచ్చేసిన బిగ్ బాస్ వీక్షకులు అభిజీత్ పేరునే యునానిమస్ గా నిలిపేశారు. అయితే మరీ అభిజీత్ కు ఈ రేంజ్ ఫాలోయింగ్ ఎందుకు వచ్చింది? సరిగ్గా అదే అంశం కూడా మెగాస్టార్ రివీల్ చేశారు. అభిజీత్ ఈ సీసన్ లో చాలా సెటిల్డ్ గా ఎమోషన్స్ కంట్రోల్ చేస్తూ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నాడు అదే అతన్ని ఇష్టపడేలా చాలా మందికి చేసి చివరికి టైటిల్ విన్నర్ గా నిలిపింది.

అతడి యాటిట్యూడ్ వల్ల గ్రాఫ్ పెంచుకున్నాడే తప్ప చివరి నిమిషం వరకు తగ్గింది లేదు. మరి ఇదే విషయాన్ని మెగాస్టార్ కూడా టైటిల్ ప్రెజెంట్ చెయ్యకముందే చెప్పేసారు. అఖిల్ మరియు అభిజీత్ ల కోసం ముందు మాట్లాడే సమయంలో అభిజీత్ ఆట కోసం స్పెషల్ గా మెన్షన్ చేశారు.

అది అతన్ని ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది అని చెప్పారు. అలాగే ప్రతీ ఒక్కరి లైఫ్ లో కూడా చాలా ఎమోషన్స్ ను కొన్ని పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలి అన్నది చాలా ముఖ్యం అని అది అభిజీత్ లో చూసినట్టుగా చిరు తెలిపారు. మొత్తానికి చిరుకి కూడా అభిజీత్ లో ఈ విషయమే బాగా నచ్చింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు