ఆ సినిమాలో నాని లుక్ మరీ అంత సీక్రెటా !?

ఆ సినిమాలో నాని లుక్ మరీ అంత సీక్రెటా !?

Published on Dec 21, 2020 12:01 PM IST

Shyam Singha Roy 1

ఇటీవలే ‘వి’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన నేచురల్ స్టార్ నాని మొదలుపెట్టిన కొత్త ప్రాజెక్ట్ ‘శ్యామ్ సింగ రాయ్’. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో సైన్ చేసిన ‘టక్ జగదీష్’ పూర్తికావడంతో ఈ సినిమాను పట్టాలెక్కించారు. పది రోజుల క్రితమే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. 2018లో ‘టాక్సీవాలా’ సినిమాతో పరిచయమైన రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా కోసం రాహుల్ దాదాపు రెండేళ్లు వెయిట్ చేశారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేసిన టీమ్ నాని లుక్ ను మాత్రం రివీల్ చేయలేదు. ఇందులో నాని తన గత సినిమాల్లో కంటే భిన్నంగా కనిపిస్తారని తెలుస్తోంది. అందుకే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసేవరకు సీక్రెట్ గా ఉంచుతారట. ఈరోజు సెట్స్ నుండి ఫోటో రిలీజ్ చేసిన నాని సైతం తన లుక్ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. ఈ చిత్రంలో నానికి జోడీగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటించనున్నారు. మొదటిరోజు చిత్రీకరణలో నానితో పాటు కకృతి శెట్టి పాల్గొంటోంది. కలకత్తా నేపథ్యంలో ఉండబోతున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ ఎస్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు