మన టాలీవుడ్ లో ఎంటర్టైనింగ్ సినిమాలకు ఒకప్పుడు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఎలా అయితే కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారో ఆ తర్వాత హీరో అల్లరి నరేష్ కొన్నాళ్ల పాటు తన హవాను కొనసాగించాడు. అలాగే ఈ ఇద్దరు నటులు కూడా కేవలం కామెడీ రోల్స్ కు మాత్రమే పరిమితం కాకుండా ఎలాంటి పాత్రను అయినా సునాయాసంగా చేయగలరు.
అయితే అల్లరి నరేష్ కు ఈ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో చాలా కాలం పాటు గడ్డు కాలం తప్పలేదు. దానితో “నాంధి” భిన్నమైన సినిమాను హీరోగా టేకప్ చేసాడు. కానీ ఇప్పుడు తాను హీరోగా పూజా జావేరి హీరోయిన్ గా నటించిన సినిమాతో ఇదే రానున్న సంక్రాంతికి తన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ తో దూసుకొచ్చేస్తున్నాడు.
ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారితో గరి పలిక దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “బంగారు బుల్లోడు”ను ఒక పోస్టర్ తో వదిలి వచ్చే సంక్రాంతికి గాను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించేసారు. అల్లరి నరేష్ నుంచి కూడా ఒక అదిరిపోయే ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలమే అయ్యింది. మరి ఈ చిత్రం పండుగకు స్పెషల్ గా నిలుస్తుందో లేదో చూడాలి.


