ప్రభాస్ “సలార్”కు కూడా ఈ సాలిడ్ టెక్నిషియన్.?

ప్రభాస్ “సలార్”కు కూడా ఈ సాలిడ్ టెక్నిషియన్.?

Published on Dec 23, 2020 7:04 AM IST

prabhas prashanth neel

లేటెస్ట్ గా ప్రభాస్ టేకప్ చేసిన సాలిడ్ ప్రాజెక్ట్ “సలార్”. కన్నడ స్టార్ దర్శకుడు ప్రభాస్ కోసం ప్రిపేర్ చేసిన హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇది. అయితే ఈ చిత్రానికి గాను ప్రశాంత్ నీల్ ఇప్పటికే సాలిడ్ ప్లానింగులు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ముందుగా క్యాస్టింగ్ విషయంలో సాలిడ్ స్కెచ్ వేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు టెక్నిషియన్స్ పరంగా కూడా అదే తరహా ప్లానింగులు వేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.

అలా తన గత సినిమాలకు అదిరిపోయే సినిమాటోగ్రఫీ అందించిన భువన్ గౌడ ను సలార్ కు కూడా తీసుకోనున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. కేజీయఫ్ లో మాస్ మసాలా షాట్స్ ను మన తెలుగు ఆడియెన్స్ కూడా ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసారు. మరి ఇది కానీ నిజం అయితే ఈ కాంబోలో మరో మాస్ ట్రీట్ వేరే లెవెల్లో ఉండడం ఖాయం అని చెప్పాలి. మరి ఈ కాంబో సెట్టవుతుందా లేదా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు