“RRR” కు మళ్ళీ చరణ్ సిద్ధమయ్యాడా.?

“RRR” కు మళ్ళీ చరణ్ సిద్ధమయ్యాడా.?

Published on Dec 23, 2020 9:00 AM IST

Ram charan 2

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఈ చిత్రంలో ఇద్దరు మాస్ హీరోలు రెండు పవర్ ఫుల్ పాత్రల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా తారక్ కొమరం భీం గా కనిపించనున్నాడు.

అయితే గత కొన్ని రోజుల నుంచి నిర్విరామంగా షూట్ చేస్తున్న జక్కన ఇప్పుడు చిన్న బ్రేక్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే మరి చరణ్ గత కొన్ని రోజుల నుంచి గడ్డం లుక్ లోకి మారిపోయి తన సోదరి నిహారిక వేడుకలో సందడి చేసిన సంగతి తెలిసిందే. కానీ అల్లూరిగా మాత్రం రాజమౌళి పరిచయం చేసిన లుక్ ను అయితే ఎవరూ అంత త్వరగా మర్చిపోరు.

మరి మళ్ళీ ఫైనల్ గా క్లీన్ షేవ్ తో అదే మీసం కట్టు లుక్ ను ప్రిపేర్ చేసి దర్శనం ఇచ్చాడు. దీనితో చాలా కాలం గ్యాప్ అనంతరం చరణ్ మళ్ళీ ఈ లుక్ లోకి మారడంతో ఈ పవర్ ఫుల్ లుక్స్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఇక అలాగే చరణ్ కూడా RRR కోసం మళ్ళీ రెడీ అయ్యినట్టే అని చెప్పాలి. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు