టీజర్ టాక్..“శశి” తో కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తున్న ఆది.!

టీజర్ టాక్..“శశి” తో కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తున్న ఆది.!

Published on Dec 23, 2020 10:13 AM IST

sasi

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో ఆది కూడా ఒకడు. తన కెరీర్ ఆరంభంలో మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తీసిన ఆదికు ఇప్పుడు అత్యవసరంగా హిట్ దొరకాల్సిన పరిస్థితి. మరి ఆ మధ్యలో ఆది కొన్ని ప్రయోగాలు చేసినా సరైన సక్సెస్ అందుకోలేదు. మరి ఈసారి మళ్ళీ ఒక ఎమోషనల్ లవ్ స్టోరీతో వస్తున్నాడు అదే “శశి”.

ఆది హీరోగా శ్రీనివాస్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ లేటెస్ట్ చిత్రం తాలూకా టీజర్ ను ఈరోజు ఆది పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చేతుల మీదగా విడుదల చేశారు. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే డిఫరెంట్ షేడ్స్ లో ఆది కనిపిస్తున్నాడు. అలాగే ఇంతకు ముందు ఎప్పుడూ ట్రై చెయ్యని లుక్ తో కనిపించి ఓ లవ్ ఫెయిల్యూర్ పెయిన్ ను ఈ టీజర్ లో అవుట్ స్టాండింగ్ గా చూపించాడు.

ఇది కొంచెం ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా సుర్భి పురానిక్ నటించింది. అయితే కాస్త అర్జున్ రెడ్డి షేడ్స్ ఇందులో కనిపించినా ఆది నుంచి డిఫరెంట్ అనే చెప్పాలి. అలాగే ఈ టీజర్ లో డైలాగ్స్ కూడా మంచి ఫీల్ తో కలిగి ఉన్నాయి. అలాగే అరుణ్ చిలివేరు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. అంతే కాకుండా అమరనాథ్ బొమ్మిరెడ్డి ఇచ్చిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు